తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన కాన్వాయ్‌ను ఆపి ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఇది కోయంబత్తూరు - వెలచెరి రహదారి మధ్య జరిగింది. అంబులెన్స్ వేగంగా వెళ్తుండడంతో.. ఎడమ వైపు కాన్వాయ్‌ను ఆపారు సీఎం స్టాలిన్. అనంతరం అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఈ విషయమూ సీఎం స్టాలిన్‌పై ప్రజలు, పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మధ్య కాలంలోనే సీఎం స్టాలిన్ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. కాన్వాయ్ వల్ల ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవద్దని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లో కేవలం రెండు పైలెట్ వాహనాలు, మూడు ఎస్కార్ట్, ఓ జామర్ వాహనం ఉంటుంది. ప్రస్తుతం సీఎం స్టాలిన్ జెడ్ ప్లస్ భ్రదతలో ఉన్నారు. అడ్వాన్స్ పైలెట్ వాహనం వెళ్లిన తర్వాత 5 నిమిషాల ముందు మాత్రమే ట్రాఫిక్‌ను పోలీసులు ఆపనున్నారు. సోమవారం ఉదయం సీఎం స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇవాళ్టి నుంచి తమిళనాడులో స్కూళ్లు తెలిరిచారు.