ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం లేఖ

డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశంలో లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గుతుందని, జనాభా ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య పెరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వాదిస్తున్నారు

By Medi Samrat
Published on : 7 March 2025 9:30 PM IST

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం లేఖ

డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశంలో లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గుతుందని, జనాభా ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య పెరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వాదిస్తున్నారు. తమిళనాడులో కొత్త జంటలు వీలైనంత త్వరగా పిల్లలు కనాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడు జనాభా పెరిగితే, డీలిమిటేషన్ లో లబ్ధి కలుగుతుందని స్టాలిన్ ఆలోచన.

తాజాగా డీలిమిటేషన్ అంశంపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్ విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. మార్చి 22న చెన్నైలో జరిగే సంయుక్త కార్యాచరణ సమావేశానికి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. స్టాలిన్ నుంచి ఆహ్వానం అందుకున్న పార్టీల్లో వైసీపీ, బీఆర్ఎస్ కూడా ఉన్నాయి. కేవలం రాజకీయ సంస్థలుగా కాకుండా ప్రజల భవిష్యత్ రక్షకులుగా ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చారు.

Next Story