మతం మరాలని హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులు.. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య

Tamil Nadu student kills self alleging abuse, forced conversion. తమిళనాడులోని తంజావూరులో 12వ తరగతి చదువుతున్న లావణ్యను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారాలని

By అంజి  Published on  20 Jan 2022 4:45 PM IST
మతం మరాలని హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులు.. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య

తమిళనాడులోని తంజావూరులో 12వ తరగతి చదువుతున్న లావణ్యను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తేవడంతో తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే వైద్యుల చికిత్సకు ఆమె స్పందించకపోవడంతో జనవరి 19 బుధవారం తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించింది. లావణ్య (17) తంజావూరులోని సెయింట్ మైకేల్స్ బాలికల వసతి గృహంలో ఉంది. హాస్టల్ వార్డెన్ ద్వారా హాస్టల్‌లోని గదులన్నీ శుభ్రం చేసేలా చేశాడని, తనను నిరంతరం తిట్టేవాడని లావణ్య చెప్పిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి నిరంతరం బలవంతం చేయబడిందని బాలిక ఆరోపించింది.

ఈ ఘటనలతో కలత చెందిన బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. జనవరి 9వ తేదీన వాంతులు చేసుకోవడంతో పాటు తీవ్ర కడుపునొప్పి రావడంతో తన కూతురు ఆస్పత్రిలో చేరిందని అరియలూర్‌కు చెందిన లావణ్య తండ్రి మురుగానందం జనవరి 10వ తేదీన సమాచారం అందించారు. మురుగానందం లావణ్యను తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి రాగానే తనకు ఎదురైన కష్టాలను వైద్యులకు చెప్పింది.

దీంతో వైద్యులు తిరుకట్టుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత లావణ్యను విచారించేందుకు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. విచారణ ఆధారంగా, బోర్డింగ్ స్కూల్ వార్డెన్ లావణ్యను వేధించాడని, ఆమెను క్రైస్తవ మతంలోకి మార్చమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వార్డెన్ సకయమరి(62)ని అరెస్ట్ చేశారు. లావణ్య చికిత్సకు స్పందించకపోవడంతో జనవరి 19వ తేదీ బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటన తిరుకట్టుపల్లి ప్రాంతంలో కలకలం రేపింది.

Next Story