ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన మహిళను.. ఫస్ట్‌టైమ్‌ విడుదల చేసిన పోలీసులు

Tamil Nadu Police releases woman who killed her husband in self defence. తొలిసారిగా, ఆత్మరక్షణ కోసం భర్తను హత్య చేసిన ఓ మహిళను తమిళనాడు పోలీసులు విడుదల చేశారు.

By అంజి  Published on  29 Jan 2022 8:24 AM IST
ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన మహిళను.. ఫస్ట్‌టైమ్‌ విడుదల చేసిన పోలీసులు

తొలిసారిగా, ఆత్మరక్షణ కోసం భర్తను హత్య చేసిన ఓ మహిళను తమిళనాడు పోలీసులు విడుదల చేశారు. 41 ఏళ్ల మహిళ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 100 కింద విడుదల చేయబడింది. ఇది ముప్పు ఉన్నప్పుడు వారి శరీరాన్ని రక్షించుకునే హక్కును ఒక వ్యక్తికి ఇస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆ మహిళ తన భర్త, 20 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మద్యానికి బానిసై, మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని మహిళను పదే పదే వేధించేవాడని సమాచారం. గురువారం రాత్రి భర్త మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తన 20 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.

మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై దాడి చేశాడు. తనను, తన కుమార్తెను రక్షించుకోవడానికి, మహిళ ఆ వ్యక్తిని సుత్తితో చంపేసింది. దీంతో ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళ, ఆమె కుమార్తెను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్య ఆత్మరక్షణ చర్యగా గుర్తించిన పోలీసులు వారిని విడుదల చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను మొదట సెక్షన్ 302 కింద నమోదు చేసి, ఐపిసి సెక్షన్ 100కి మార్చారు. ఆ తర్వాత మహిళను పోలీసులు విడిచిపెట్టారు. మహిళను మళ్లీ అరెస్టు చేయబోమని, వివరాలను కోర్టు ముందు హాజరుపరుస్తామని వర్గాలు పేర్కొన్నాయి.

Next Story