సినీ ఫక్కీలో మాజీ మంత్రిని.. వెంటాడి వెంటాడి పట్టుకున్న పోలీసులు

Tamil Nadu Police arrests ex-AIADMK minister Rajendra Balaji. తమిళనాడు డెయిరీ మంత్రిగా ఉన్న సమయంలో ఆవిన్ నుంచి రూ.3 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు అన్నాడీఎంకే మాజీ మంత్రి

By అంజి  Published on  6 Jan 2022 2:30 AM GMT
సినీ ఫక్కీలో మాజీ మంత్రిని.. వెంటాడి వెంటాడి పట్టుకున్న పోలీసులు

తమిళనాడు డెయిరీ మంత్రిగా ఉన్న సమయంలో ఆవిన్ నుంచి రూ.3 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీని తమిళనాడు పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. ఆవిన్ తమిళనాడు ప్రభుత్వంలోని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ క్రింద ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్. డిసెంబరు 23న పరారీలో ఉన్న మాజీ మంత్రిపై తమిళనాడు పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన రెండు వారాల తర్వాత, తమిళనాడు పోలీసుల ప్రత్యేక బృందం జనవరి 5, బుధవారం కర్ణాటకలోని హాసన్‌లో సినీ ఫక్కీలో పోలీసులు రాజేంద్ర బాలాజీని అరెస్టు చేశారు.

రాజేంద్ర బాలాజీ 2016 ఏఐఏడీఎంకే హయాంలో పాలు, డెయిరీ డెవలప్‌మెంట్ మంత్రి అయ్యారు. అధికార దుర్వినియోగంపై రాజేంద్ర బాలాజీపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేయగా మద్రాసు హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. రాజేంద్ర బాలాజీ దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు తమిళనాడు పోలీసులు డిసెంబర్ 23న లుకౌట్ నోటీసు జారీ చేశారు. పరారీలో ఉన్న రాజేంద్ర బాలాజీని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 15 రోజుల తర్వాత రాజేంద్ర బాలాజీని కర్ణాటకలోని హాసన్‌లో అరెస్టు చేశారు.

రాజేంద్ర బాలాజీ ఒక చోట నుండి మరొక ప్రదేశానికి మారుతున్నాడని, అతని లొకేషన్‌ను జీరో ఇన్ చేయడం పోలీసులకు కష్టంగా మారిందని వర్గాలు చెబుతున్నాయి. కానీ అతని చిత్రం టోల్ ప్లాజాలో బంధించబడింది. అతడు కారులో వెళ్తున్న దృశ్యాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని వెంటాడారు. కర్నాటకలోని హసన్ సమీపంలో సిగ్నల్‌ వద్ద వాహనం ఆగడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Next Story