ఇక సీబీఐకి నో ఎంట్రీనే: స్టాలిన్ ప్రభుత్వం
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తున్నాయంటే డీఎంకే నేతల గుండెల్లో గుబులు మొదలైంది. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు
By అంజి Published on 15 Jun 2023 12:43 PM ISTఇక సీబీఐకి నో ఎంట్రీనే: స్టాలిన్ ప్రభుత్వం
తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తున్నాయంటే డీఎంకే నేతల గుండెల్లో గుబులు మొదలైంది. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 'క్యాష్ ఫర్ జాబ్' మనీలాండరింగ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. 18 గంటలపాటు మంత్రిని ఆయన ఇంట్లోనే ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు. సెంథిల్ బాలాజీ భారీగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీకి ఆధారాలు, కీలక పత్రాలు లభించడంతో అరెస్ట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అరెస్ట్ విషయం వినగానే మంత్రి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేయించారు. ఆసుపత్రిలో ఉన్న మంత్రి సెంథిల్ ను తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణ్యం తదితరులు పరామర్శించారు. సెంథిల్ బాలాజీకి చికిత్స కొనసాగుతోందని మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. బీజేపీ రాజకీయాలకు తాము భయపడే ప్రస్తక్తే లేదని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. ఇక నుండి తమిళనాడు రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాఫ్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తెలిపింది. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన క్రమంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరి మీదైనా దర్యాప్తుకు రావాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.