కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రం ఒక్కో తరహాలో చర్యలు తీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో ఉంది. మహమ్మారి ముంచేస్తున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు కోవిడ్- 19 రోగులకు చికిత్స చేసే వైద్యులకు ఒక్కొక్కరికి 30 వేలు, నర్సులకు 20 వేలు, ఇతర కార్మికులకు 15 వేల చొప్పున పారితోషికంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
అంతేకాదు అదనంగా పీజీ విద్యార్థులు అంటే హౌస్ సర్జన్ లు మరియు ట్రైనింగ్ వైద్యులకు ప్రోత్సాహకాలుగా 20,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రేయింబవళ్ళు శ్రమించి, ప్రాణాలు కోల్పోయిన 43 మంది ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాలకు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఒక్కొక్కరికి పాతిక లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.