ఇకపై 'పోలీసు' స్టిక్కర్ ఉండకూడదు..!

కొంతమంది పోలీసు అధికారులకు తమ సొంత వాహనాలపై 'పోలీసు' అనే స్టిక్కర్ వేయించుకుంటూ ఉండడం కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పదం అయింది.

By Medi Samrat
Published on : 12 March 2025 4:20 PM IST

ఇకపై పోలీసు స్టిక్కర్ ఉండకూడదు..!

కొంతమంది పోలీసు అధికారులకు తమ సొంత వాహనాలపై 'పోలీసు' అనే స్టిక్కర్ వేయించుకుంటూ ఉండడం కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పదం అయింది. దీంతో ఇలా చేయడం చట్టవిరుద్ధమని హోంమంత్రి స్పష్టం చేశారు, వీలైనంత త్వరగా ఆ స్టిక్కర్స్ ను తీసివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది తమ ప్రైవేట్ వాహనాలపై పోలీస్ లేబుళ్లను అతికించడానికి అనుమతించే నిబంధన ఏదీ లేదని చెప్పారు. అలాంటి పనులు అధికారిక దుర్వినియోగమే కాకుండా, చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని తెలిపారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సిఎన్. బాలకృష్ణ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన వచ్చింది. అలాంటి పద్ధతులు చట్టబద్ధంగా అనుమతించరని, చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయని హోం మంత్రి స్పష్టం చేశారు. పోలీసు అధికారులు తమ ప్రైవేట్ వాహనాలపై ఈ స్టిక్కర్లను అతికించడానికి అనుమతించే నిబంధన లేదని అన్నారు.

చాలా మంది పోలీసు అధికారులు తమ అధికారిక బైక్‌లు, కార్లతో పాటు ప్రైవేట్ వాహనాలను కలిగి ఉంటారు. వారు తమ వ్యక్తిగత వాహనాలపై "పోలీస్" స్టిక్కర్‌లను అతికిస్తూ ఉంటారు.

Next Story