పేటీఎం యూజర్లకు కీలక సూచన చేసిన NHAI

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బుధవారం నాడు Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు కీలక సూచన చేసింది.

By Medi Samrat  Published on  13 March 2024 5:47 PM IST
పేటీఎం యూజర్లకు కీలక సూచన చేసిన NHAI

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బుధవారం నాడు Paytm ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు కీలక సూచన చేసింది. మార్చి 15, 2024 లోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు పెనాల్టీలు లేదా రెట్టింపు రుసుములను చెల్లించకుండా సహాయపడుతుందని NHAI తెలిపింది. Paytm ఫాస్ట్‌ట్యాగ్ వాడుతున్నట్లైతే టోల్ ప్లాజాల వద్ద అసౌకర్యం కలిగే అవకాశం ఉందని తెలిపింది.. ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణ అనుభూతిని పొందాలంటే వేరే బ్యాంకుకు చెందిన ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని అధికారిక ప్రకటన తెలిపింది.

Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై పరిమితులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, Paytm FASTags వినియోగదారులు 15 మార్చి 2024 తర్వాత బ్యాలెన్స్‌ని రీఛార్జ్ చేసుకోలేరు. వారు నిర్ణీత తేదీకి మించి టోల్ చెల్లించడానికి తమ ప్రస్తుత బ్యాలెన్స్‌ని ఉపయోగించవచ్చు. మార్చి 15 తర్వాత ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ అప్పటికే ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను ఫాస్టాగ్ చెల్లింపుల కోసం వినియోగించవచ్చు.

Next Story