16 ఏళ్ల స్వీడిష్‌ అమ్మాయి.. సోషల్‌ మీడియా స్నేహితుడికి కలిసేందుకు ముంబైకి వచ్చింది.. కానీ

Swedish teen travels to Mumbai to meet her social media friend. సోషల్ మీడియాలో తనతో స్నేహం చేసిన 19 ఏళ్ల యువకుడిని కలవడానికి తన ఇంటిని విడిచిపెట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లిన 16 ఏళ్ల స్వీడిష్ బాలికను

By అంజి  Published on  12 Dec 2021 9:36 AM IST
16 ఏళ్ల స్వీడిష్‌ అమ్మాయి.. సోషల్‌ మీడియా స్నేహితుడికి కలిసేందుకు ముంబైకి వచ్చింది.. కానీ

సోషల్ మీడియాలో తనతో స్నేహం చేసిన 19 ఏళ్ల యువకుడిని కలవడానికి తన ఇంటిని విడిచిపెట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్లిన 16 ఏళ్ల స్వీడిష్ బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యూనిట్-6 వారి ఇంటర్‌పోల్ కోఆర్డినేషన్ సెల్ ద్వారా తప్పిపోయిన స్వీడిష్ అమ్మాయి గురించి 'ఎల్లో నోటీసు' అందిందని ఒక అధికారి తెలిపారు. టీనేజ్ అమ్మాయి ముంబైలో నివసిస్తున్న తన 19 ఏళ్ల ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడితో టచ్‌లో ఉన్నట్లు కూడా వెల్లడైంది. భారత్‌లో మూలాలున్న ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నవంబర్ 27న ఆమె స్వదేశంలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది.

ఈ నేపథ్యంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్నేహితుడి ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేశారు. సాంకేతిక వివరాల సహాయంతో ఆ యువకుడు కళాశాల విద్యార్థి అని తేల్చారు. తూర్పు శివారులోని ట్రాంబే ప్రాంతంలోని చీటా క్యాంప్‌లో బాలిక ఉంటున్నట్లు అతడు వెల్లడించినట్లు అధికారి తెలిపారు. తదనంతరం క్రైమ్ బ్రాంచ్ అధికారులు బాలికను తమ కస్టడీలోకి తీసుకుని దక్షిణ ముంబైలోని డోంగ్రీలో ఉన్న పిల్లల ఇంటికి పంపించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో జరిగిన పరిణామాలపై స్వీడిష్ ఎంబసీ, ఢిల్లీ ఇంటర్‌పోల్ కార్యాలయానికి సమాచారం అందించింది.

బాలిక తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు ముంబైకి వచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత, అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగించారు. వారు తిరిగి స్వీడన్‌కు వెళ్లారు. "అమ్మాయి టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడిపై ఎటువంటి ఫిర్యాదు చేయనందున, ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదు" అని డిసిపి (డిటెక్షన్) నీలోత్పాల్ చెప్పారు.

Next Story