'హిందూ-ముస్లిం' వాట్సాప్ గ్రూప్ వివాదం.. ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం
'హిందూ వాట్సాప్ గ్రూప్' సృష్టించిన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
By Medi Samrat Published on 12 Nov 2024 9:25 AM GMT'హిందూ వాట్సాప్ గ్రూప్' సృష్టించిన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని ఆల్ ఇండియా సర్వీసెస్ కేడర్‌ల మధ్య విభజన, అనైక్యత, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వాట్సాప్ గ్రూప్ ఉద్దేశ్యమని ప్రభుత్వం విశ్వసిస్తోందని సస్పెన్షన్ ఆర్డర్ పేర్కొంది. అధికారి చర్యలు "అఖిల భారత సర్వీసుల కేడర్‌లో మతపరమైన నిర్మాణం, కక్ష సాధింపు" సృష్టించడానికని ప్రాథమికంగా కనుగొనబడినట్లు సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నారు.
తన మొబైల్ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, మరొకరు ఈ వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారని, తన అనుమతి లేకుండానే మల్లు హిందూ ఆఫీసర్స్, మల్లు ముస్లిం ఆఫీసర్స్ అనే రెండు వాట్సాప్ గ్రూప్‌ల అడ్మినిస్ట్రేటర్‌గా చేశారని ఆరోపణలపై గోపాలకృష్ణన్ వివరణ ఇచ్చారు. అయితే.. అతని వాదనను విచారణ బృందం తోసిపుచ్చింది.
ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వివాదం అక్టోబర్ 31వ తేదీ జరగగా.. కేరళ కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు ఊహించని విధంగా మల్లు హిందూ ఆఫీసర్స్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. ఈ బృందంలో హిందూ అధికారులు మాత్రమే ఉన్నారు. చాలా మంది అధికారులు సమూహాన్ని లౌకిక విలువల ఉల్లంఘనగా భావించారు. అయితే.. రెండు రోజుల తర్వాత గ్రూప్ తొలగించబడింది. చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ నివేదిక ఆధారంగా ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యహహారంలో మరో అధికారిపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.