24 గంటల సమయం ఇస్తున్నాం.. కేంద్రం, ఆప్ స‌ర్కార్‌పై సుప్రీం ఆగ్రహం.!

Supreme Court's Tough Warning Over Delhi Pollution. ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై విచారణ చేపట్టిన భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం

By అంజి  Published on  2 Dec 2021 8:14 AM GMT
24 గంటల సమయం ఇస్తున్నాం.. కేంద్రం, ఆప్ స‌ర్కార్‌పై సుప్రీం ఆగ్రహం.!

ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై విచారణ చేపట్టిన భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఢిల్లీ వాయు కాలుష్యం పెరిగిపోయిందని, గత కొన్ని వారాలుగా తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. "ఏమీ జరగడం లేదని, కాలుష్యం పెరుగుతూనే ఉందని మేము భావిస్తున్నాము ... సమయం మాత్రమే వృధా అవుతోంది" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ విచారణ సందర్భంగా అన్నారు.

దేశ రాజధానిలో గాలి కాలుష్యం సంక్షోభంపై కోర్టు వాదనలు వినడం ఇది వరుసగా నాలుగో వారం. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, పారిశ్రామిక, వాహన కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కోర్టు 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. అలాగే కఠిన కాలుష్య నియంత్రణకు చేపట్టే ప్రణాళికలు వెల్లడించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. దీపావళి తర్వాత గత నెలలో ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది. వ్యవసాయ పొలాల్లో మంటలు కూడా ఒక మూలంగా పేర్కొనబడ్డాయి. నెల రోజులు గడిచినా ఢిల్లీ నగరం గాలి కోసం గాలిస్తోంది.

పాఠశాలలను పునఃప్రారంభించడంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఛీత్కరించింది. మూడేళ్లు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు, కానీ పెద్దలు ఇంటి నుండి పని చేస్తున్నారని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా "మీ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి మేము ఒకరిని నియమిస్తాము" అని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. "పాఠశాలల్లో, 'లెర్నింగ్ లాస్'పై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ఎంపికతో సహా షరతుతో మేము మళ్లీ ప్రారంభించాము." అన్నారు.

"మీరు దీన్ని ఐచ్ఛికంగా వదిలేశారని మీరు అంటున్నారు. అయితే ఇంట్లో ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు? మాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. మహమ్మారి నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు మాకు తెలుసు. మీరు చర్య తీసుకోకపోతే మేము రేపు మేము కఠిన చర్యలు తీసుకుంటాము. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం'' అని ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

Next Story