పతంజలికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు
సుప్రీం కోర్టు యోగా గురు రామ్ దేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2024 7:38 PM ISTసుప్రీం కోర్టు యోగా గురు రామ్ దేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. రామ్ దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ లు ఆయుర్వేదిక్ ప్రాడక్ట్స్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధిక్కార నోటీసులు పంపించింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకూ పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి యాడ్స్ ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది. అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రాడక్ట్స్ ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పతంజలి డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను ఆయుర్వేదిక్ మందులు, యోగాతో పూర్తిగా నయం చేస్తుందని అడ్వటైజింగ్ చేయడాన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తప్పుబట్టింది. రామ్‌దేవ్‌పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 188, 269, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పతంజలి ఉత్పత్తులు కొన్ని వ్యాధులను నయం చేయగలవని తప్పుడు క్లెయిమ్ చేస్తే రూ. 1 కోటి జరిమానా విధిస్తామని నవంబర్ 2023లో కూడా సుప్రీం కోర్టు హెచ్చరించింది. "మేము హెచ్చరించినప్పటికీ, రసాయన ఆధారిత మందుల కంటే మీ ఉత్పత్తులు మంచివని మీరు చెబుతున్నారు." అంటూ సుప్రీం కోర్టు ఇప్పటి హియరింగ్ లో వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా క్యాంపెయిన్ నిర్వహించిందని ఆరోపిస్తూ IMA దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బెంచ్ విచారించింది. పతంజలి ఆయుర్వేదిక్ వ్యాధుల్ని వెంటనే, పూర్తిగా నయం చేస్తుందని చేసిన యాడ్స్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో యాడ్స్ పబ్లిసిటీ చేసినందుకు పతంజలిపై చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ ఉంటుందని కోర్టు మార్చి 15కు వాయిదా వేసింది. ప్రకటనల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణన్‌లకు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ వ్యక్తులు తప్పనిసరిగా ప్రత్యుత్తరం దాఖలు చేయాలని, వారు కోర్టు ఆదేశాలను ఎలా బేఖాతరు చేశారో వివరించాలని జస్టిస్ అమానుల్లా అన్నారు.