డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 11:46 AM IST

National News, Delhi, Supreme Court, Digital Arrest Scams

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య బెంచ్ విచారించింది. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టులో వాదనలు వినిపిస్తూ…ఇవి మన దేశ సరిహద్దుల వెలుపల నుండి నడుస్తున్న మనీ లాండరింగ్ గ్యాంగుల పని — ముఖ్యంగా మయన్మార్, థాయ్‌లాండ్ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నాయి” అని తెలిపారు.జస్టిస్ సూర్యకాంత్ హర్యానా ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి, “మీ రాష్ట్రం ఈ కేసుల విచారణ దర్యాప్తు కేంద్ర సంస్థ (సెంట్రల్ ఏజెన్సీ) ద్వారా జరగాలని అభిప్రాయం తెలుపితే, కోర్టు దానిని సదుద్దేశపూర్వకంగా రికార్డ్ చేస్తుంది” అని చెప్పారు.

హర్యానా ప్రభుత్వ న్యాయవాది రాష్ట్రంలో ఇలాంటి మరికొన్ని FIRలు ఉన్నాయని, వాటి వివరాలు సేకరించడానికి వారం రోజులు సమయం కావాలని అభ్యర్థించారు. కోర్టు దీనికి అనుమతిచ్చింది. ఇలాంటి సైబర్ మోసాలకు సంబంధించిన అన్ని పిర్యాదుల FIR వివరాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక వారం లోగా సమర్పించాలి. ఫార్మల్ కౌంటర్ అవసరం లేదు; కేసుల వివరాలు మాత్రమే కోర్టు ముందు ఉంచాలి.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తెలిపారు: “ఇది సాధారణ సమస్య కాదు. మూడు స్థాయిల్లో నడుస్తోంది – ఆర్థిక, సాంకేతిక, మానవ. యువతను విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసి, వారి పాస్‌పోర్టులు తీసేసి బానిసలుగా పనిచేయిస్తారు” అని వివరించారు. జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానిస్తూ, “మయన్మార్‌లో ఇటీవల సైబర్ మోసాలపై చర్యలు తీసుకున్న తర్వాత, ఆ గ్యాంగులు థాయ్‌లాండ్‌కి తరలిపోయాయి” అన్నారు. “CBIకి ఈ కేసులన్నింటినీ విచారించే సామర్థ్యం ఉందా తెలుసుకోండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవచ్చు” అని సూచించింది.

“CBI ప్రస్తుతం హోం మంత్రిత్వశాఖ సైబర్ క్రైమ్ డివిజన్ సహాయంతో పనిచేస్తోంది” అని తెలిపారు. జస్టిస్ బాగ్చి “పాంజీ కేసుల సమయంలో CBI మీద అధిక ఒత్తిడి ఏర్పడింది. ఇది కూడా పెద్ద ఎత్తున ఉన్న కేసులు” అన్నారు. ఈ కేసులు ఇంటర్‌పోల్, విదేశీ పోలీసులతో సమన్వయం అవసరం ఉన్న అంతర్జాతీయ నేరాలు. మేము విచారణను నిరంతరం పర్యవేక్షిస్తాం” అని తెలిపారు. కాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు సంబంధించిన FIR వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ…తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Next Story