కరోనా పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఏపీ, బీహార్ రాష్ట్రాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటలకు తమ ముందు విచారణకు ఏపీ, బీహార్ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. కొవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఈరోజు విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది. చట్టానికి ఎవరు అతీతులు కాదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది.