ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

ఆరావళి పర్వతాలలో మైనింగ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 29 Dec 2025 1:51 PM IST

National News, Delhi, Supreme Court, Aravalli Hills , Central Environment Ministry

ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: ఆరావళి పర్వతాలలో మైనింగ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. సోమవారం ఆరావళి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తీర్పుపై అయోమయం తొలగించేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరావళిపై సుప్రీంకోర్టు తీర్పు, కమిటీ నివేదికలపై అపార్థాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.

అయితే ఆరావళిపై గత కమిటీ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పును స్వతంత్ర కమిటీ అధ్యయనం చేయనుంది. అధ్యయనం పూర్తయ్యే వరకు కమిటీ నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పు నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్వతంత్ర నిపుణుల కమిటీకి ఐదు అంశాలపై మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సహా మరో రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది.

Next Story