ఒక కేసులో ఇచ్చిన ఉత్తర్వు గురించి చర్చించడానికి తన సోదరుడికి ఫోన్ చేసిన ఒక వ్యక్తిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ బుధవారం ఒక పిటిషన్ విచారణ సందర్భంగా మందలించారు. ఇలాంటి చర్యలను సహించబోమని సీజేఐ అన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి న్యాయవాదిని "మీ క్లయింట్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు?" అని ప్రశ్నించారు.
లైవ్ లా ప్రకారం.. ఈ కేసు హర్యానాకు చెందిన ఇద్దరు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించినది. వీరు బౌద్ధ మైనారిటీ కోటా కింద ఉత్తర ప్రదేశ్‌లోని సుభార్తి మెడికల్ కాలేజీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశం పొందడానికి బౌద్ధమతంలోకి మారారు. వారు సబ్-డివిజనల్ అధికారులు జారీ చేసిన మైనారిటీ సర్టిఫికెట్లను సమర్పించారు. జనవరి 2026లో సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్పిడుల వాస్తవికతపై తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. ప్రవేశం పొందడానికి ఇది ఒక ఎత్తుగడ కావచ్చని సీజేఐ పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్ 'పునియా' కులానికి చెందినవారు.
కేసు విచారణ సందర్భంగా పిటిషన్‌ను తిరిగి విచారణకు జాబితా చేసినప్పుడు.. సీజేఐ పిటిషనర్ల న్యాయవాదిని.. 'మీ క్లయింట్ తండ్రి ఏం చేశాడో మీకు తెలుసా?' అని అడిగారు. లేదా నేను అతనికి బహిరంగ కోర్టులో చెప్పాలా? అతడు నా సోదరుడికి ఫోన్ చేసి, సీజేఐ ఈ ఉత్తర్వును ఎలా జారీ చేశారో చెప్పాడు.? అతడు నాకు ఆదేశాలు ఇస్తాడా.? "క్లయింట్ తప్పు చేస్తుంటే మీరే విచారణ జరిపి, కేసును ఉపసంహరించుకోవాలి.. అలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు.. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు.. మళ్ళీ ఎప్పుడూ అలా చేసే సాహసం చేయకు.. గత 23 ఏళ్లుగా నేను ఇలాంటి వాళ్లతోనే వ్యవహరిస్తున్నాను.. కేసును బదిలీ చేసే ఉద్దేశం లేదని, పైగా ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, పిటిషనర్ల న్యాయవాది ఆ సంఘటన గురించి తమకు తెలియదని చెప్పి క్షమాపణలు చెప్పారు.