కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది

By Medi Samrat  Published on  15 July 2024 9:15 PM IST
కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంను జాతీయ దర్యాప్తు సంస్థ ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఈ దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

Next Story