‘ది కేరళ స్టోరీ’ సినిమాపై బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శింపబడుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో సినిమా మంచిదా చెడ్డదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్ మందలించారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమాను ఎందుకు నిషేధించిందని.. ఈ సినిమాను ఎందుకు నడపకూడదని ప్రభుత్వాన్ని సీజేఐ ప్రశ్నించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా రన్ అవుతోందన్నారు. ఈ సినిమా ప్రజల్లో ఆగ్రహం తెప్పించి రాష్ట్రంలోని వాతావరణాన్ని పాడు చేయగలదని కేరళ స్టోరీని నిషేధించినట్లు ప్రభుత్వం చెబుతోంది.