ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రొక‌రికి బెయిల్‌..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat  Published on  2 Sep 2024 9:33 AM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రొక‌రికి బెయిల్‌..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయ్ నాయర్ సుమారు 23 నెలలుగా కస్టడీలో ఉన్నారు. విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరు చేయడం ప‌ట్ల‌ ఢిల్లీ మంత్రి అతిషి స్పందించారు. సత్యమేవ జయతే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై కుట్ర పన్నింది. చాలా మంది పార్టీ నాయకులను జైల్లో పెట్టింది. అయితే మనీష్ సిసోడియా, విజయ్ నాయర్‌లకు బెయిల్ వచ్చిన తరువాత.. నిజాయితీప‌రుల‌ను ఇబ్బంది పెట్టవచ్చు.. కానీ ఓడించలేమని రుజువు అయ్యింద‌ని అన్నారు.

విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వ‌ర్తించేవారు. విజయ్ నాయర్ ఓన్లీ మచ్ లౌడర్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు మాజీ CEO. ఆయ‌న అనేక‌ స్టాండప్ కామెడీ, లైవ్ మ్యూజిక్ షోలకు కూడా పనిచేశాడు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సౌత్ గ్రూప్ సభ్యులకు సంబంధించి ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను కేంద్ర‌ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. కవిత, శరత్‌రెడ్డి, రాఘవ్‌ మాగుంట, మాగుంట శ్రీనివాసులు రెడ్డితోపాటు ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌లను అరెస్టు చేశారు. కేబినెట్‌ మంత్రి బంగ్లాలో ఉండి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పనిచేసినట్లు విజయ్‌ నాయర్‌ వాంగ్మూలాలు వెల్లడించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.

Next Story