లైంగిక వేధింపుల కేసులో సంచలన నిర్ణయాలు తీసుకున్న జడ్జికి షాక్ ఇచ్చిన సుప్రీం
Supreme Court Collegium withdraws recommendation to make Bombay High Court judge permanent. ఇటీవలి కాలంలో సంచలన తీర్పులను
By Medi Samrat
ప్రస్తుతం జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ లో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ బెంచ్ కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించేందుకు ఈ నెల 20న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆమె వెలువరించిన తాజా తీర్పుల నేపథ్యంలో, ఆ సిఫారసులను కొలీజియం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాంబే హైకోర్టులో శాశ్వత జడ్జిగా జస్టిస్ పుష్పని ఉంచాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.
ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఓ వ్యక్తిని కింది సెషన్స్ కోర్టు దోషిగా తేల్చగా జస్టిస్ పుష్ప మాత్రం కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. అతను లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. పిల్లలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే చట్టం (Pocso) కింద అతనిపై కేసు నమోదైంది. శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట 12 ఏళ్ల బాలికపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను హైకోర్టులో జస్టిస్ పుష్ప కొట్టివేశారు. ఈ కేసులో నిందితుడు... లైంగిక ఉద్దేశాలతో బాలిక చర్మాన్ని తాకడం అనేది జరగలేదనీ... స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ జరగనప్పుడు... అది లైంగిక వేధింపుల నేరం కాదని చెప్పింది. అందువల్ల ఇది పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని జనవరి 19న తీర్పు ఇచ్చింది. బాలిక చేతులు పట్టుకోవడం, ప్యాంట్స్ జిప్ విప్పదీయడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావని.. వాటిని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని మరో సంచలన తీర్పు ఇచ్చింది.సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం జస్టిస్ పుష్ప గనేడివాలాను బాంబే హైకోర్టులో శాశ్వత జడ్జిగా ఉంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఇప్పుడు వెనక్కి తీసుకున్లట్లు బార్ అండ్ బెంచ్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది.