ఇటీవల హరిద్వార్‌లో ధర్మ సంసద్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక వేత్తలు విద్వేషపూర్వక ప్రసంగాలు చేశారు. కాగా మైనారిటీ వర్గాలపై హింసను ప్రేరేపిస్తున్నట్లు ఆరోపిస్తున్న హరిద్వార్ 'ధర్మ సన్సద్' ప్రసంగాలపై స్వతంత్ర విచారణ కోరుతూ దాఖలైన పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను విచారణ స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.
పిఐఎల్ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. దేశం యొక్క నినాదం 'సత్యమేవ జయతే' నుండి 'సశస్త్రమేవ జయతే'గా మారుతున్నట్లు కనిపిస్తోంది. మనం చాలా ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నామని ఆయన అన్నారు. సీజేఐ ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లి సిబల్‌కి చెప్పినప్పుడు.. కొన్ని చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోందని, రెండు ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదయ్యాయి కానీ అరెస్టులు చేయలేదు" అని సిబల్ అన్నారు. దీనిపై విచారణ చేపడతామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.