సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సునీతా కేజ్రీవాల్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. ఇదిలావుంటే.. సీఎం లేఖను సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ప్రజల కోసమే అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారని తెలిపారు.
అరెస్ట్ చేయడం మాకు ఆశ్చర్యం కలిగించడం లేదని లేఖలో రాశారు. నన్ను అరెస్టు చేసినప్పటికీ.. జైలులో ఉన్నా లేదా బయట ఉన్నా? నేను మీ కోసం పని చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఒక్కసారి ఆలయాన్ని సందర్శించి తన కోసం ప్రార్థించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. త్వరలో బయటకు వస్తాను. మహిళా సమ్మాన్ యోజన కింద కచ్చితంగా రూ.1000 అందజేస్తామని ఢిల్లీలోని మహిళలతో అన్నారు. ఏ జైలు కూడా నన్ను ఎక్కువ కాలం లోపల ఉంచలేదన్నారు.
నా జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే అని అన్నారు. త్వరలో బయటకు వస్తానని.. మీ కోసం పనిచేస్తానని కేజ్రీవాల్ అన్నారు. కోట్లాది ప్రజల ప్రార్థనలు నా వెంట ఉన్నాయి. ప్రజాసేవ పనులు ఆగకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. బీజేపీ వాళ్లను ద్వేషించకండి.. వాళ్లంతా నా సోదరులే. నేను త్వరలో తిరిగి వస్తాను.. ఇట్లు మీ అన్న అరవింద్.. అని లేఖలో పేర్కొన్నట్లు చదివి వినిపించారు.