సునేత్రా పవార్‌కే పట్టం.. తర్వాత జరగబోయేది ఇదే..!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 8:40 PM IST

సునేత్రా పవార్‌కే పట్టం.. తర్వాత జరగబోయేది ఇదే..!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో ఆమె భర్త, అప్పటి ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. ఆయన స్థానంలో పార్టీ బాధ్యతలను ఇప్పుడు సునేత్రా పవార్ స్వీకరించారు. ముంబైలో జరిగిన ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ఆమె పేరును ప్రతిపాదించగా, సునీల్ తట్కరే బలపరిచారు. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్సీపీకి అధ్యక్షురాలైన తొలి మహిళగా, అలాగే శరద్ పవార్, అజిత్ పవార్ తర్వాత మూడవ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ గుర్తింపు పొందారు.

అజిత్ పవార్ మరణం తర్వాత జనవరి 31న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన 'బారామతి' అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సునేత్రా పవార్ పోటీ చేయనున్నారని, అలాగే ఆమె కుమారుడు పార్థ్ పవార్‌ను రాజ్యసభకు పంపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Next Story