సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా (CESSI) సూర్యుడి నుండి ఈరోజు భారీ సౌర మంట/సౌరజ్వాల/ సోలార్ ఫ్లేర్ ను కనుగొన్నారు. సౌర జ్వాల కారణంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లను ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో భానుడు విరుచుకుపడ్డాడని.. కోల్‌కతా వేదికగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్(CESSI) ఇండియా వెల్లడించింది.
"X2.2 క్లాస్ సోలార్ ఫ్లేర్ విస్ఫోటనం 3:57 UTC (9.27 IST) వద్ద సోలార్ మాగ్నెటిక్ యాక్టివ్ రీజియన్ AR12992 నుండి జరిగింది" అని CESSI అసోసియేట్ ప్రొఫెసర్ మరియు కోఆర్డినేటర్ దిబ్యేందు నంది చెప్పారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలు వెలువడ్డాయని.. ఇవి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయని వెల్లడించింది.
ఈ సందర్బంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది మాట్లాడుతూ.. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్12992 నుంచి బుధవారం ఉదయం 9.27గంటలకు X2.2 తరగతికి చెందిన సౌరజ్వాలలు వెలువడ్డాయని అన్నారు. ఈ సౌరజ్వాలల ప్రభావం భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రభావం చూపించిందని తెలిపారు. దీని వల్ల హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు.