హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిస్టానం.. రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీకి నాయకత్వం వహించిన సుఖ్వీందర్ సింగ్ సుఖును తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. సుఖ్వీందర్ సింగ్ సుఖు హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ అగ్నిహోత్రి ఉపముఖ్యమంత్రి కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, నేను ఒక బృందంగా పని చేస్తాం. 17 ఏళ్ల వయసులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. కాంగ్రెస్ పార్టీ నా కోసం చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేను అని సుఖు విలేకరులతో అన్నారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.