గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక సూట్‌కేస్‌లో రూమ్‌కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు.. ప్లాన్‌ బెడిసి కొట్టి..

హర్యానాలోని సోనిపథ్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్‌లోకి సూట్‌కేస్‌లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లాలనుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

By Medi Samrat
Published on : 12 April 2025 4:48 PM IST

గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక సూట్‌కేస్‌లో రూమ్‌కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు..  ప్లాన్‌ బెడిసి కొట్టి..

హర్యానాలోని సోనిపథ్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్‌లోకి సూట్‌కేస్‌లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లాలనుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన కెమెరాలో చిక్కింది. క్లిప్‌లో కొంతమంది విద్యార్థులు చుట్టూ నిలబడి ఉండగా హాస్టల్ గార్డులు సూట్‌కేస్‌ను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు చేసిన ప్లాన్‌ బెడిసి కొట్టింది. ఆమెను ఓ పెద్ద సూట్ కేసులో ఉంచి, హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు.ఆ సూట్‌కేస్‌ను తెర‌వ‌గానే లోప‌ల‌ అమ్మాయి కనిపించింది. సూట్‌కేస్ లోపల ఎవరో దాక్కున్నారని హాస్టల్ గార్డులు లేదా విశ్వవిద్యాలయ అధికారులు ఎలా కనుక్కున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ విషయంలో ఏవైనా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారులు ధృవీకరించలేదు.

Next Story