రాహుల్ పాకిస్థాన్ లో భారత్ జోడో యాత్రను మొదలుపెట్టాలి

Start Bharat Jodo Yatra in Pakistan Himanta Biswa attack on Congress. బుధవారం నాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ

By Medi Samrat  Published on  7 Sep 2022 12:45 PM GMT
రాహుల్ పాకిస్థాన్ లో భారత్ జోడో యాత్రను మొదలుపెట్టాలి

బుధవారం నాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను ఈ శతాబ్దపు అతిపెద్ద కామెడీ అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. రాహుల్ తన భారత్ జోడో యాత్రను భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో ప్రారంభించాలని హిమంత బిస్వా శర్మ అన్నారు. హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. "ఇది కామెడీ కాదా. మీరు (కాంగ్రెస్) 1947లో దేశాన్ని విభజించారు. ఇప్పుడు మీకు భారత్ జోడో కావాలి. దేశం సమైక్యంగా ఉన్న చోట మీరు ఇలాంటి వాటిని ప్రయత్నిస్తున్నారు. ఏకీకరణ కావాలంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం పాకిస్థాన్ కు వెళ్లాలి'' అని శర్మ అన్నారు. హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో "భారత్ జోడో యాత్ర శతాబ్దపు హాస్యభరితమైనది! ఈ రోజు మనం జీవిస్తున్న భారత్ దృఢమైనది, ఐక్యమైనది. 1947లో కాంగ్రెస్ కారణంగా భారతదేశం విభజించబడింది. ఏకీకరణ కావాలంటే పాకిస్థాన్‌కి భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ వెళ్ళాలి'' అని అన్నారు.

భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది. సుదీర్థ పాదయాత్ర ప్రారంభానికి ముందు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి , మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి రాహుల్ గాంధీ నివాళులర్పించారు. మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్న రాహుల్ సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం తన తండ్రి జ్ఞాపకార్థం శ్రీపెరంబుదూర్ లో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూర్‌లో ఆత్మాహుతి బాంబు దాడిలో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు. యాత్ర ప్రారంభానికి ముందు తన తండ్రి స్మారకాన్ని సందర్శించిన అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విధ్వేష, విభజన రాజకీయాల వల్ల తన తండ్రిని కోల్పోయానని, మళ్లీ అవే విభజన, విద్వేష రాజకీయాల కారణంగా తన దేశం విడిపోకుండా చూసుకుంటానని వ్యాఖ్యానించారు.


Next Story