ఓటు హ‌క్కు వినియోగించుకున్న దాదా

Sourav Ganguly today cast his vote at a polling booth in Barisha Shashibhusan Janakalyan Vidyapith. ప‌శ్చిమ బెంగాల్‌లో 4వ విడ‌త‌

By Medi Samrat  Published on  10 April 2021 9:32 AM GMT
ఓటు హ‌క్కు వినియోగించుకున్న దాదా

ప‌శ్చిమ బెంగాల్‌లో 4వ విడ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు 52.89 శాతం పోలింగ్ న‌మోదవ‌గా.. ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, ప్ర‌స్తుత బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. బెంగాల్‌లోని ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణాలు జిల్లా బెహ‌లా ప‌ట్టణంలోని బ‌హిషా శ‌శిభూష‌ణ్ జ‌నక‌ల్యాణ్ విద్యాపీఠ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయ‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయ‌నతోపాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కూడా ఓటు వేశారు.

ఇదిలావుంటే.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా దాదాని ఓ రెండు మూడు సందర్భాల్లో కలవడం, బీజేపీ నేతలు కూడా అతనితో సంప్రదింపులు జరపడంతో.. ఈ ఏడాది గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని అంతా ఊహించారు.

ఈ నేపథ్యంలో.. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో దాదాని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశలో పోలింగ్ జరగనుంది. జీవితం ఎక్కడికి వెళ్తుందో.. ఏం జరుగుతుందో చూడాలి. రాజకీయ పార్టీలు నాపై శ్రద్ధ చూపుతున్నాయి. కానీ.. నాకు ఇప్పుడు అటువైపు వెళ్లే ఆలోచన లేదు. కోల్‌కతా సిటీలో సాధారణ జీవితం గడపాలని ఆశిస్తున్నా. చాలా మంది ప్రజల్ని కలుస్తున్నాను. వారితో మాట్లాడుతున్నా.. వారి కోసం కాస్త సమయం కేటాయించగలుగుతున్నా. క్రికెట్ పరంగా ప్రస్తుతానికి నాకు అప్పగించిన బాధ్యతని నిర్వర్తిస్తున్నాన‌ని గంగూలీ స్పష్టం చేశాడు.


Next Story
Share it