త్వరలోనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కిసాన్‌ సెల్స్‌

Soon CM KCR will start BRS Kisan Cells across the country. హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి లేదా టీఆర్ఎస్) పార్టీ..

By అంజి  Published on  21 Dec 2022 4:23 AM GMT
త్వరలోనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కిసాన్‌ సెల్స్‌

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి లేదా టీఆర్ఎస్) పార్టీ.. దేశ వ్యాప్త కార్యక్రమాల కోసం సిద్ధమవుతోంది. త్వరలోనే పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరు రాష్ట్రాల్లో కిసాన్‌ సెల్‌ యూనిట్లను ప్రారంభించనున్నారు. క్రిస్మస్ తర్వాత భారతదేశం అంతటా పార్టీ కార్యక్రమాలతో దూకుడుగా సాగనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విధాలుగా వెళ్లబోతున్నారు.

కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రకారం.. ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించిన భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్‌ఎస్ కిసాన్ సెల్) డిసెంబర్ చివరి నాటికి ప్రారంభిస్తారు. మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశాతో సహా అనేక రాష్ట్రాల్లో కూడా బీఆర్‌ఎస్‌ జెండాలు ఎగురవేయబడతాయి. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీఆర్‌ఎస్‌ కిసాన్ సెల్‌లు ప్రారంభించబడతాయి.

ఉత్తర భారతం, తూర్పు, మధ్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నేతలు, అనుచరులతో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్.. ఈ అంశంపై చర్చించినట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ పొరుగున ఉన్న ఏపీ నుండి 'అధిక స్పందన' ఉంది. ఏపీలోని అనేక జిల్లాలలో బీఆర్‌కేసీ (కిసాన్ సెల్)ను కూడా ప్రారంభించబోతోంది.

డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ విధానాలు, కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని బీఆర్ఎస్ పేర్కొంది. డిసెంబర్ చివరి నుంచి దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. పార్టీ పేరు మార్చే విషయమై భారత ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా సమాచారం అందిన వెంటనే సీఎం కేసీఆర్ కార్యాచరణను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

భారత ఎన్నికల సంఘం ఆమోదం పొందిన తర్వాత ఈ నెల ప్రారంభంలో టీఆర్‌ఎస్‌ అధికారికంగా బీఆర్‌ఎస్‌గా పేరు మార్చబడింది. ఆ తర్వాత ఢిల్లీలో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. డిసెంబరు 14న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ముఖ్యమంత్రులు (సమాజ్‌వాదీ పార్టీ అధినేత) అఖిలేష్ యాదవ్, (జేడీఎస్ అధినేత) కుమారస్వామి, ప్రముఖ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు.

2019కి ముందు నాన్ కాంగ్రెసేతర, బీజేపీయేతర 'ఫెడరల్ ఫ్రంట్'ని ప్రారంభించాలని మాట్లాడిన కేసీఆర్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలవగానే ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే సూచనలను వదిలిపెట్టిన ఆయన, చివరకు అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ ఏర్పాటును ప్రకటించారు. భారతదేశ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు నేడు ఇతర రాష్ట్రాల రైతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అదే తెలంగాణ స్ఫూర్తితో ముందడుగు వేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ సాగునీటి రంగాన్ని దీర్ఘకాలిక లక్ష్యంతో పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story