కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టంలో ఉన్న ఎంతో మందికి సహాయం చేయడం భారీగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూ సూద్. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సీటు వంటి పదవులను ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. అయితే వాటన్నింటినీ తిరస్కరించినట్లు తెలిపారు.
“నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు, నేను నిరాకరించినప్పుడు, వారు నన్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు, నాకు రాజ్యసభ సీటు ఇచ్చి నన్ను తీసుకోమని చెప్పారు" అని సోనూ సూద్ తెలిపారు. ఆ పదవులు తనకు వద్దని చెప్పానని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక, దేనికోసం పోరాడాల్సిన అవసరం ఉండదని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ అన్నారు. పదవులను స్వీకరించి తన స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోనూ సూద్ తెలిపారు.