సోనియా గాంధీకి కరోనా
Sonia Gandhi tests Covid-19 positive.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని ఆ పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2022 3:15 PM ISTకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం తెలిపారు. "ఆమె వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నారు" అని సుర్జేవాలా చెప్పారు. సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం ఉందని చెప్పారు. ఆమె కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఆమెకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పారు. 75 ఏళ్ల సోనియా గాంధీ గత వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. వీరిలో కొందరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పార్టీ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని జూన్ 8న ఏజెన్సీ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8న ED ముందు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం అలాగే ఉందని సుర్జేవాలా స్పష్టం చేశారు.
బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోనియా గాంధీకి జూన్ 8న హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. జూన్ 2న ఇదే కేసుపై ED పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కూడా సమన్లు పంపింది. అయితే ప్రస్తుతం ఆయన భారతదేశంలో లేరు. బుధవారం సాయంత్రం సోనియాకు తేలికపాటి జ్వరం, కోవిడ్-19 లక్షణాలు కనిపించాయని సూర్జేవాలా తెలిపారు. ఆమె క్షేమంగా ఉన్నారని త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నామని సుర్జేవాలా ట్వీట్ చేశారు.