హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి

By -  Knakam Karthik
Published on : 6 Jan 2026 1:01 PM IST

National News, Delhi, Soniagandhi, Ganga Ram Hospital

హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఛాతీ వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, ఛాతీ వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వెల్లడించాయి. సాధారణ చెకప్​ కోసం ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం కారణంగా దగ్గుతో ఆస్పత్రిలో చేరినట్లు వివరించాయి. కాగా డిసెంబర్ 2025లో గాంధీకి 79 సంవత్సరాలు నిండాయి.

సోనియాగాంధీ ఆరోగ్యంపై సర్ గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ..సోనియాగాంధీ శ్వాసకోశ అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారని, వైద్య పరీక్షలో, చల్లని వాతావరణం, కాలుష్యం యొక్క మిశ్రమ ప్రభావాల కారణంగా ఆమె శ్వాసనాళాల ఉబ్బసం స్వల్పంగా తీవ్రతరం అయినట్లు తేలిందని డాక్టర్ వివరించారు.

కాగా ముందుజాగ్రత్త చర్యగా, ఆమెను మరింత పరిశీలన, చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్చారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉందన్నారు. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోన్నారని, యాంటీబయాటిక్స్ మరియు ఇతర సహాయక మందులతో చికిత్స పొందుతోన్నట్లు చెప్పారు. ఆమె క్లినికల్ పురోగతి ఆధారంగా చికిత్స చేస్తున్న వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేసే నిర్ణయం తీసుకుంటారని, ఒకటి లేదా రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని డాక్టర్ స్వరూప్ అన్నారు.

Next Story