తల్లిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టిన కొడుకు
Son kicks mother in Maharajganj.అమ్మను దేవతలా చూసుకోవాల్సింది పోయి గొడ్డును బాదినట్లు బాదాడు
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2022 7:25 AM GMTతల్లిని మించిన దైవం లేదు. బిడ్డకు జన్మనిచ్చేందుకు అమ్మ పునర్జన్మ ఎత్తుతుంది. తనకు ఏ కష్టం ఎదురైనా బిడ్డను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి అమ్మను దేవతలా చూసుకోవాల్సింది పోయి గొడ్డును బాదినట్లు బాదాడు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కూడా నెట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన రితేశ్ వర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. రితేశ్ వర్మ తల్లి ఖర్చుల గురించి కొంత నగదు అతడిని అడిగింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. తల్లిని నడిరోడ్డుపై పడేసి కొట్టాడు. ఆమె ఎంత వేడుకున్నా కనికరించలేదు. ముఖంపై , ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నాడు. ఓ స్థానికుడు అడ్డుకోగా ఆ వ్యక్తిని కూడా తోసేసి మరీ కొట్టడం కొనసాగించాడు. చివరికి ఆమె అపస్మారక స్థితికి చేరడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తరువాత స్థానికులు వచ్చి ఆమెను పక్కకు తీసుకువెళ్లారు.
#WATCH: Son thrashes mother mercilessly in #UttarPradesh's Maharajganj district.
— Free Press Journal (@fpjindia) November 26, 2022
In the viral video, one can see him dragging his mother by her hair, kicking and punching her in the face.#India #IndiaNews #UPNews #UPPolice #Mother #Son #ViralVideo pic.twitter.com/25MgKlO6M2
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.