సోషల్ 'కింగ్స్' వీరే.. మోదీ, జగన్‌ల హ‌వా..!

Social Media Heroes. సోషల్‌ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రికార్డుల మీద రికార్డులు

By Medi Samrat  Published on  24 Nov 2020 5:24 AM GMT
సోషల్ కింగ్స్ వీరే.. మోదీ, జగన్‌ల హ‌వా..!

సోషల్‌ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరు మీద‌నే ఉన్నాయి. తాజాగా.. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను 'చెక్‌బ్రాండ్స్‌' సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది.

ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్ పొలిటికల్‌ లీడర్లు, 500 మంది అత్యంత‌ ప్ర‌భావ‌వంతులైన‌ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెండో స్థానంలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.

అలాగే.. బ్రాండ్‌ స్కోర్‌ విషయంలోనూ మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్‌మెంట్, మెన్షన్స్‌.. ఆధారంగా బ్రాండ్‌ స్కోర్‌ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్‌లో మోదీ 70 స్కోర్‌తో ప్ర‌థ‌మ స్థానంలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 36.43 రెండో స్థానంలో.. ఆ తరువాత స్థానాల్లో.. సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ (31.89), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(27.03) ఉన్నారు. ఇక‌ బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే హ‌వా కొన‌సాగుతుంది. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు కాగా.. ఆ తరువాతి స్థానాల్లో అమిత్‌ షా(రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(రూ. 328 కోట్లు) ఉన్నారు.


Next Story