భార్యకు పాముకాటు.. గొనెసంచితో ఆసుపత్రికి వచ్చిన భర్త..!

Snake Bites Wife, Husband Takes Reptile To The Hospital In A Bizarre Incident In UP. యూపీలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను ఓ పాము కరిచింది.

By M.S.R  Published on  17 April 2023 6:17 PM IST
భార్యకు పాముకాటు.. గొనెసంచితో ఆసుపత్రికి వచ్చిన భర్త..!

యూపీలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యను ఓ పాము కరిచింది. అయితే ఏ పాము కరిచింది అని డాక్టర్లు అడుగుతారని అనుకున్నాడో ఏమో.. ఏకంగా ఆ పామును ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. తన భార్యను కరిచిన పాము ఇదే అంటూ వైద్యులకు చూపించడంతో వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

ఉన్నావ్ జిల్లా సఫీపూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఉమర్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి గోనె సంచినిలో పామును ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అతని భార్య కుస్మ పాము కాటుకు గురైనట్లు తెలిపాడు. మహిళ వంటగదిలో పని చేస్తుండగా కొండచిలువ కాటు వేసింది. పాము కాటు వేసిన కొన్ని సెకన్ల తర్వాత మహిళ స్పృహతప్పి పడిపోయింది.వెంటనే మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భర్తకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి తన భార్యను చూసేందుకు వస్తూ వస్తూ.. ఇంటికి వెళ్లి పామును పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.

పామును చూసిన ఆసుపత్రి అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. పామును ఆసుపత్రికి ఎందుకు తీసుకువచ్చారని ఆ వ్యక్తిని అడిగారు. తన భార్యను కాటు వేసిన పాము ఆధారంగా వైద్యం చేయించడానికి తీసుకుని వచ్చినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ తుషార్ శ్రీవాస్తవ తెలిపారు.


Next Story