చిన్నారి మెడ‌కు చుట్టుకున్న నాగుపాము.. రెండు గంట‌ల పాటు అలాగే..

Snake Bites a girl after making round to her neck.ఓ చిన్నారి ఇంట్లో హాయిగా ప‌డుకుంది. అయితే.. ఎక్క‌డి నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2021 8:04 AM IST
చిన్నారి మెడ‌కు చుట్టుకున్న నాగుపాము.. రెండు గంట‌ల పాటు అలాగే..

ఓ చిన్నారి ఇంట్లో హాయిగా ప‌డుకుంది. అయితే.. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు కానీ.. ఓ నాగుపాము ఇంట్లోకి ప్ర‌వేశించింది. నిద్ర‌పోతున్న చిన్నారి మెడ‌కు చుట్టేసుకుంది. కొద్ది సేప‌టి త‌రువాత చిన్నారి మెడ‌లో నాగ‌పాము ఉండ‌డాన్ని ఆ బాలిక కుటుంబ స‌భ్యులు గుర్తించారు. అయితే.. ఏ మాత్రం శ‌బ్దం చేసిన ఆ పాము.. బాలికను కాటు వేస్తుంది. దీంతో కుటుంబ స‌భ్యులు మెల్లిగా పామును ప‌ట్టుకునేందుకు య‌త్నించినా.. సాధ్యప‌డ‌లేదు. అలా ఆ బాలిక మెడ‌లో పాము సుమారు 2 గంట‌ల‌కు పైగానే ఉంది. చివ‌ర‌కు చిన్నారి కాస్త క‌ద‌ల‌డం.. వెంట‌నే ఆ పాము బాలిక చేయిపై కాటు వేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. మహారాష్ట్ర వార్దాలో ఈ ఘటన జరిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. వార్ధాలోని సేలు ప‌ట్ట‌ణంలో ఏడేళ్ల చిన్నారి దివ్యానీ గడ్కరీ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. అయితే.. దివ్యానీ ప‌డుకున్న‌ప్పుడు ఓ నాగుపాము ఇంట్లోకి ప్ర‌వేశించింది. దివ్యానీ మెడ‌కు చుట్టుకుని బుస‌లు కొడుతోంది. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. కొద్ది క్ష‌ణాల పాటు వారికి ఏమీ చేయాలో అర్ధం కాలేదు. అనంత‌రం తేరుకున్న వారు పామును ప‌ట్టుకునేందుకు ఎన్నో ర‌కాలు ప్ర‌య‌త్నించారు. అయినా.. వారి ప్ర‌య‌త్నం వృధానే అయ్యింది. పాము అక్క‌డ నుంచి క‌ద‌ల్లేదు. అలా రెండు గంట‌లు గ‌డిచింది. చివ‌ర‌కు దివ్యానీ కాస్త క‌దిలింది. దీంతో నాగుపాము.. దివ్యానీ చేయిపై కాటు వేసింది. అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు దివ్యానీని సేవాగ్రామ్​లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Next Story