తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు

Six-yr-old boy takes ailing father to hospital in wooden cart in Madhyapradesh. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు

By అంజి  Published on  12 Feb 2023 11:32 AM IST
తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆరేళ్ల బాలుడు తోపుడు బండిని తోసుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు అంబులెన్స్‌ సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. శనివారం తోపుడు బండిని తోసుకుంటూ వెళ్తున్న బాలుడిని స్థానికులు కొందరు గమనించి సోషల్ మీడియాలో రికార్డ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సింగ్రౌలి జిల్లాలోని బలియారి పట్టణంలో ఫోన్‌ చేసిన తర్వాత ఒక గంటకు పైగా ఆ కుటుంబం అంబులెన్స్ కోసం వేచి చూసింది. అయితే అంబులెన్స్‌ ఎంతకీ రాకపోవడంతో అనారోగ్యానికి గురైన వ్యక్తి కుమారుడు.. తన తండ్రిని తోపుడు బండిపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైరల్ వీడియోలో, టీ-షర్టు, నీలిరంగు డెనిమ్‌లు ధరించిన ఒక బాలుడు.. తోపుడు బండిపై తండ్రిని ఉంచి మెల్లగా నెట్టుకుంటూ వెళ్లాడు. అతను మూడు కిలోమీటర్లు తోపుడు బండిన నెట్టాడు. అతని తల్లి కూడా బండిని నెట్టడం వీడియోలో కనిపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో, సింగ్రౌలీ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని గ్రహించి, శనివారం సాయంత్రం తర్వాత ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. ''అంబులెన్స్ అందుబాటులో లేనందున, రోగిని అతని భార్య, అమాయక కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని తెలిసింది. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని కనుక్కోవలసిందిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్‌లను ఆదేశించాము'' అని సింగ్రౌలీ అదనపు కలెక్టర్ డిపి బర్మన్ చెప్పారు.

రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం లేదా వారి మృతదేహాలను తిరిగి వారి ఇళ్లకు తీసుకెళ్లడం, గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్నాయి.

Next Story