ఇస్లామియత్, ఖురాన్ సబ్జెక్ట్స్ లో సిక్కు బాలుడికి మొదటి స్థానం

ఓంకార్ సింగ్ అనే సిక్కు కుర్రాడు లాహోర్‌లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BISE) 9వ తరగతి పరీక్ష 2025లో రాణించాడు.

By Medi Samrat
Published on : 21 Aug 2025 2:30 PM IST

ఇస్లామియత్, ఖురాన్ సబ్జెక్ట్స్ లో సిక్కు బాలుడికి మొదటి స్థానం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఓంకార్ సింగ్ అనే సిక్కు కుర్రాడు లాహోర్‌లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BISE) 9వ తరగతి పరీక్ష 2025లో రాణించాడు. 15 ఏళ్ల విద్యార్థి ఇస్లామియత్‌లో 100కి 98 మార్కులు సాధించాడు. ఈ సబ్జెక్ట్ లో ఇస్లాంకు సంబంధించిన అంశాలు, ప్రపంచ దృష్టికోణం, నాగరికత వంటి అంశాలు చెప్పిస్తారు. భౌతిక శాస్త్రంలో 60, రసాయన శాస్త్రంలో 60, జీవశాస్త్రంలో 59 స్కోర్లు సాధించాడు.

మిన్మల్ సింగ్ కుమారుడైన ఓంకార్ ప్రతి సబ్జెక్టులోనూ A+ గ్రేడ్‌లను సాధించాడని BISE లాహోర్ వెబ్‌సైట్ లో అప్లోడ్ చేసిన మార్క్‌షీట్ తెలిపింది. ఓంకార్ సింగ్ ఇంగ్లీషులో 75, ఉర్దూలో 74, పవిత్ర ఖురాన్ అనువాదంలో 50కి 49 మార్కులు సాధించాడు.




Next Story