Karnataka CM Swearing : సిద్ధరామయ్య అనే నేను..

Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక‌ల‌లో గెలిచ‌న‌ప్ప‌టి నుంచి సీఎం పదవిపై

By Medi Samrat
Published on : 20 May 2023 1:04 PM IST

Karnataka CM Swearing : సిద్ధరామయ్య అనే నేను..

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక‌ల‌లో గెలిచ‌న‌ప్ప‌టి నుంచి సీఎం పదవిపై పట్టుదలతో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ లు.. సిద్ధ‌రామ‌య్య‌ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్య‌క్ర‌మం ద్వారా విపక్షాల ఐక్యతను చూపించడానికి కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేసింది. ప‌లు రాష్ట్రాల పెద్ద నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చేతులు ఎత్తి ఐక్యతను చాటుతూ.. రాహుల్ వేదిక వద్దకు చేరుకున్నారు.





Next Story