తాత అయిన ముఖేష్ అంబానీ

Shloka, Akash Ambani Become Parents To Baby Boy. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట వారసుడు

By Medi Samrat  Published on  10 Dec 2020 10:48 AM GMT
తాత అయిన ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ అవ్వా-తాత అయ్యారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ భార్య శ్లోకా మెహతా పండంటి బాబుకు జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో కొద్దిసేపటి కిందటే శ్లోకా మెహతా.. కుమారుడికి జన్మనిచ్చినట్లు ముఖేష్ అంబానీ కుటుంబం వెల్లడించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది.గ‌త ఏడాది మార్చిలో ఆకాష్ అంబానీ-శ్లోకా మెహత వివాహం జరిగింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మోహతాల కుమార్తె శ్లోకా. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టెలికమ్యూనికేషన్ల విభాగాన్ని ఆకాష్ అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లలో ఆకాష్ ఒకరు. ధీరూభాయ్ వంశంలో కొత్త తరం ఆరంభమైందని, నూతన శకానికి ఇది దారి తీస్తుందని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

''శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్‌ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్‌ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్‌ మునిమనవడికి స్వాగతం పలికడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది'' అంటూ అంబానీ కుటుంబం శుభవార్తను పంచుకుంది.


Next Story
Share it