జనవరి 6న డీకే శివకుమార్ సీఎం అవుతారు..!

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జనవరి 6న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి అవుతారని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ ఎ ఇక్బాల్ హుస్సేన్ శనివారం జోస్యం చెప్పారు.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 4:26 PM IST

జనవరి 6న డీకే శివకుమార్ సీఎం అవుతారు..!

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జనవరి 6న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి అవుతారని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ ఎ ఇక్బాల్ హుస్సేన్ శనివారం జోస్యం చెప్పారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ఆక్రమించిన సీఎం పదవిని శివకుమార్‌ కోసం వదులుకోవాలని ఆయన అన్నారు. శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ విలేకరులతో అన్నారు.

"జనవరి 6న ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 99 శాతం ఉన్నాయి" అని డీకే శివకుమార్‌కు మద్దతుదారు అయిన హుస్సేన్ అన్నారు. 6వ తేదీనే ఎందుక‌ని అడగ‌గా.. "నాకు తెలియదు.. ఇది కేవలం యాదృచ్ఛికంగా చెప్పింది.. అందరూ ఇలా చెబుతున్నారు.,. అది జనవరి 6 లేదా 9 కావచ్చు. ఈ రెండు తేదీలలో ముఖ్యమంత్రి అవుతారని" చెప్పాడు. శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని హుస్సేన్ డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఆయన తన కోరికను బయటపెట్టారు.

కాగా, సీఎం పదవి కోసం హోంమంత్రి జి. పరమేశ్వరకు మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ వీ సోమన్న తెలిపారు. అధికారం దక్కడం అదృష్టం, పరమేశ్వరా హోం మంత్రిగా కొనసాగుతారని కలలో కూడా ఊహించలేదు, ఆయనను సీఎంగా చూడాలనేది మా కోరిక, ఆయనను సీఎంగా చూడాలనే కోరిక నాకే కాదు తుమకూరు ప్రజలకు ఉందని తుమకూరులో జరిగిన కార్యక్రమంలో సోమన్న అన్నారు. సీఎం పదవికి బలమైన పోటీదారుగా ఉన్న డీకే శివకుమార్ గురించి సోమ‌న్న‌ను ఒకరు ప్రశ్నించగా.. "అది వదిలేయండి. అది సెకండరీ. శివకుమార్ ఏం కావాలనుకుంటున్నారో అతని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రవర్తన అదృష్టం కంటే పెద్దది" అని అన్నారు.

Next Story