ఏక్‌నాథ్‌ షిండే మరోసారి కీలక నిర్ణయం

Shinde-Fadnavis govt restores 4 decisions scrapped by MVA. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు

By Medi Samrat
Published on : 16 July 2022 8:15 PM IST

ఏక్‌నాథ్‌ షిండే మరోసారి కీలక నిర్ణయం

ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా, నవీ ముంబైలోని విమానాశ్రయానికి డీబీ పాటిల్‌గా మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం తన చివరి కేబినెట్‌లో రెండు పట్టణాలు, విమానాశ్రయం పేర్లను మార్చిందన్నారు. ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని, గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని అన్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం మరోసారి పేర్లను మార్చిందన్నారు.

దీనిపై శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం కార్యకర్తలు ఔరంగాబాద్‌లో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. శివసేన తిరుగుబాటు నేత, సీఎం షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Next Story