ఐదు కాదు.. ఆరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఆడ చిరుత 'గామిని'

షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మార్చి 10న ఆడ చిరుత గామిని ఐదు కాదు ఆరు చిరుత‌ పిల్లలకు జన్మనిచ్చింది.

By Medi Samrat  Published on  18 March 2024 8:34 AM GMT
ఐదు కాదు.. ఆరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఆడ చిరుత గామిని

షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మార్చి 10న ఆడ చిరుత గామిని ఐదు కాదు ఆరు చిరుత‌ పిల్లలకు జన్మనిచ్చింది. అటవీ శాఖ బృందం సోమవారం ఆరో పిల్లను గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. గామిని వారసత్వం ముందుకు సాగుతుంది. ఈ ఆనందానికి అంతు లేదు. ఇవి ఐదు కాదు.. ఆరు పిల్లలు. ఐదు పిల్లలు పుట్టినట్లు వార్తలు వచ్చిన వారం రోజుల తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన గామిని అనే చిరుత ఆరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం వెలుగుచూసింది. ఆడ చిరుత ఆరు పిల్లలకు జన్మనివ్వడం ఓ రికార్డు.

మార్చి 10వ తేదీన ఆడ చిరుత గామిని ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే గడ్డి ఉండటంతో ఒక్క పిల్ల కనిపించలేదు. సోమవారం పార్కు బృందం పర్యవేక్షణలో ఆరు పిల్లలను చూడగా.. ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో కునో నేషనల్ పార్క్‌లో చిరుతపులుల సంఖ్య ఇప్పుడు 26కి పెరిగింది. వాటిలో 13 పిల్లలు కావ‌డం గ‌మ‌నార్హం.

18 ఫిబ్రవరి 2023న దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలను కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. 12 చిరుతల్లో ఒక ఆడ చిరుత గామిని. కునో నేషనల్ పార్క్‌లో 12 చిరుతపులిలను మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మగ చిరుత పవన్ లాగా.. ఆడ చిరుత గామిని కూడా కునో సరిహద్దుల నుండి బయటకు వెళ్లి కునో నేషనల్ పార్క్ బృందాల కృషితో తిరిగి వచ్చింది. కునో నేషనల్ పార్క్‌లో పిల్లలతో సహా మొత్తం చిరుతపులుల సంఖ్య 26. ఇందులో 13 పిల్లలు, 13 వయోజన చిరుతలు ఉన్నాయి.


Next Story