నాలుగు సార్లు ఉప‌ ముఖ్యమంత్రిని చేశా.. ఏం అన్యాయం జ‌రిగింది.?

సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు బారామతిలోని మాలెగావ్‌లో ఓటు వేశారు.

By Medi Samrat  Published on  20 Nov 2024 2:00 PM IST
నాలుగు సార్లు ఉప‌ ముఖ్యమంత్రిని చేశా.. ఏం అన్యాయం జ‌రిగింది.?

సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు బారామతిలోని మాలెగావ్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన మేనల్లుడు అజిత్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అజిత్ పవార్ 4 సార్లు ఉప‌ ముఖ్యమంత్రిని చేశామ‌ని శరద్ పవార్ అన్నారు. చాలా ఏళ్లు మంత్రి పదవిలో ఉండి అధికారం తన వద్దే ఉండిపోయింది. ఇంత చేసినా తనకు అన్యాయం జరిగిందని అంటున్నారు.

అతడు చాలాసార్లు అధికారం పొందాడు.. అయినప్పటికీ అతను తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే.. అతనికి నిజంగా అన్యాయం జరిగిందా అనే ప్రశ్న తలెత్తుతుంది? యుగేంద్ర పవార్‌కు కూడా ప‌ద‌వి రావాలని.. ఎందుకంటే అతను ఈ కుటుంబంలో కొత్తవాడని.. అతను కూడా అవ‌కాశం పొందాలని అన్నారు.

మీడియాతో శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. ఈ ప్రభుత్వానికి మెజారిటీ వస్తుంది.. నేను జ్యోతిష్యుడిని కాను.. అందువల్ల సీట్ల సంఖ్యపై ఎలాంటి కామెంట్ చేయ‌ను.. కానీ మహావికాస్ అఘాడి ప్రభుత్వం మెజారిటీతో ఏర్పడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నారు.

ఇదిలావుంటే.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ 175 సీట్లకు పైగా గెలుస్తుందని అజిత్ పవార్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ వాదనపై శరద్ పవార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ 175 సీట్లు చెప్పాడు.. అతను 280 సీట్లు ప్రకటించాలి.. అజిత్ పవార్ లెక్కలు సరిగ్గా వేసంటే.. ఆయ‌న‌ చెప్పిన గణాంకాలు ఇంకా ఎక్కువ ఉండాలని కామెంట్ చేశారు.

Next Story