జైలులో ఆర్యన్‌ను కలిసిన షారూక్‌ ఖాన్‌.!

Shahrukh khan met aryan khan. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలుకు వచ్చారు. క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో

By అంజి  Published on  21 Oct 2021 10:58 AM IST
జైలులో ఆర్యన్‌ను కలిసిన షారూక్‌ ఖాన్‌.!

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలుకు వచ్చారు. క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిని కలిసిందేకు షారుక్‌ జైలుకు వచ్చారు. కుమారుడు ఆర్యన్‌ఖాన్‌తో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయాడు. షారుక్‌ ఖాన్‌ పోలీసుల అదుపులో ఉండగా తన కుమారుడిని కలుసుకోవడం ఇదే ఫస్ట్‌టైమ్‌. అక్టోబర్‌ 2న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత చాలా సార్లు బెయిల్‌ కోసం అభ్యర్థనలు పెట్టుకున్నాడు. కోర్టు మాత్రం ప్రతిసారి ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరిస్తోంది.

ఈ కేసును స్పెషల్‌ కోర్టు విచారిస్తోంది. నిన్న కూడా ఆర్యన్‌కు కోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో కుమారుడు ఆర్యన్‌ను చూసేందుకు షారుక్‌ ఖాన్‌ జైలుకు వచ్చాడు. గతవారం వీడియో కాల్‌లో ఆర్యన్‌ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. జైలులో ఉన్న వ్యక్తులను కలుసుకునేందుకు వారి బంధువులకు వీలు కల్పించింది. జైలులో ఉన్న వారిని ఇద్దరు కుటుంబ సభ్యులు కలవవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో షారుక్‌ ఖాన్‌ తన కుమారుడిని కలుసుకునేందుకు జైలుకు వచ్చారు. ఇప్పటికే కేసు విచారణలో భాగంగా ఆర్యన్‌తో షారుక్‌ మేనేజర్‌, న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతున్నారు.

నిన్న కూడా ముంబై స్పెషల్‌ కోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించింది. ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయంటూ కోర్టు వ్యాఖ్యనించింది. ఆర్యన్‌ వాట్సాప్‌ చాట్‌ను పరిశీలిస్తే డ్రగ్స్‌ సరఫరా దారులను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని స్పెషల్‌ జడ్జి వీవీ పాటిల్‌ వ్యాఖ్యనించారు. గత 18 రోజులుగా ఆర్యన్‌ ఖాన్‌ జైలులో గడుపుతున్నాడు.

Next Story