వ్యభిచారం నేరం కాదు : కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Sex work an offence if it causes public nuisance, says Mumbai court. వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By M.S.R  Published on  23 May 2023 3:00 PM GMT
వ్యభిచారం నేరం కాదు : కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని.. అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది. ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది. బాధితురాలు మేజర్ అని, ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భారతదేశ భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగడానికి, నివసించడానికి, స్థిరపడే ప్రాథమిక హక్కు. బాధితురాలు మేజర్, ఆమె భారత పౌరురాలు, అందువల్ల ఆమె ఈ హక్కులను కలిగి ఉంది. కారణం లేకుండా బాధితురాలిని నిర్బంధించినట్లయితే ఆమె హక్కులను ఉల్లంఘించినట్టే అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.


Next Story