లాక్ డౌన్ లో కూడా అమ్మాయిలతో జల్సాలు.. ఫామ్ హౌస్ లో పార్టీలు..!

Sex racket busted at raid of party in Kudje farmhouse.మహారాష్ట్ర లోని కుద్జే గ్రామంలోని ఫామ్ హౌస్ లో అమ్మాయిలతో కలిసి డాన్స్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on  30 April 2021 9:08 AM GMT
sex rocket

మహారాష్ట్రలో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే..! ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ ఉన్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది జీవితాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి. అయితే కొందరు మాత్రం సెలవుల్లా లాక్ డౌన్ రోజులను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏకంగా అమ్మాయిలను పిలిపించి వారితో డ్యాన్స్ లు వేయించి ఎంజాయ్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్ర లోని కుద్జే గ్రామంలోని ఫామ్ హౌస్ లో అమ్మాయిలతో కలిసి డాన్స్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ రైడ్ చేయగా.. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన నలుగురు కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. పూణే నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో డ్యాన్స్ పార్టీ జరుగుతోందనే సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే పార్టీ ఫుల్ స్వింగ్ లో డీజేతో ఉందట..! పోలీసులను చూడగానే వారు షాక్ తిన్నారు. డీజే సెట్ ను, విదేశీ మద్యం ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఎఫ్.ఐ.ఆర్. ను నమోదు చేశారు. అయిదుగురు సెక్స్ వర్కర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిని వ్యభిచారం ముగ్గు లోకి దింపిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


Next Story
Share it