వారి కోసం జల్లెడ పడుతున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు
అనేక రాష్ట్రాలలో అక్రమ వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి.
By Medi Samrat
అనేక రాష్ట్రాలలో అక్రమ వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి. వివిధ ప్రాంతాలలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లు, తీరప్రాంత భద్రతా సంస్థలకు ఇప్పటికే వీరికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించే ప్రక్రియను సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF)ను ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం.
చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ లేదా విదేశీ పౌరులను నియమించవద్దని రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సమాచారం అందించామని రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు, తీరప్రాంత భద్రతా దళాలు, ఇతర విభాగాలతో కలిసి పనిచేయడంతో పాటు, పరిణామాలను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం STF ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.
ఇదే తరహాలో పలు రాష్ట్రాలలో కూడా రోహింగ్యాల కోసం, బంగ్లాదేశ్ వలసదారుల కోసం అధికారులు వేట మొదలుపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్రమ వలసదారులతో భారతదేశానికి పెను ముప్పు ఉందని జాతీయ మీడియాతో స్పష్టం చేశారు.