Video : బెయిల్ పొందిన తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకున్న రేపిస్టులు

కర్నాటకలోని హవేరి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat
Published on : 23 May 2025 2:34 PM IST

Video : బెయిల్ పొందిన తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకున్న రేపిస్టులు

కర్నాటకలోని హవేరి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు 16 నెలల క్రితం నాటిది. వివ‌రాళ్లోకెళితే.. జనవరి 2024లో ఏడుగురు వ్య‌క్తులు కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితులు మహిళను సమీపంలోని అడవిలోకి లాగి అత్యాచారం చేశారు. అప్పుడు అరెస్టైన ఈ ఏడుగురికి బెయిల్ వచ్చింది. దీంతో నిందితులు విజయయాత్ర త‌ర‌హా సంబ‌రాలు చేసుకున్నారు. బైక్‌లు, కార్లు, సంగీత్‌తో పాటు పెద్దఎత్తున సంబరాలతో కూడిన ర్యాలీని నిర్వహించారు.

హావేరిలోని అక్కి ఆలూర్ పట్టణంలో ఊరేగింపు జరిగింది. అక్కడ స్థానిక రోడ్లపై.. జైలు నుంచి విడుదలైన నిందుతులతో స‌హా వారి స‌హ‌చ‌రుల‌ మోటర్‌బైక్‌లు, కార్ల కాన్వాయ్ కనిపించింది. వీడియోలో.. నిందితులు నవ్వుతూ, విజయ చిహ్నాలను చూపడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. విజయయాత్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వారి విడుదలపై ప్రజలు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు.

బైకులు, కార్లు, వాద్యాలు, పెద్దఎత్తున వేడుకల నినాదాలతో నిందితులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిందితులు విజయయాత్ర చేసిన ఘటనపై హవేరీ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హవేరీ సెషన్స్ కోర్టు ఏడుగురు ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. వారి పేర్లు అఫ్తాబ్ చందన్‌కట్టి, మదర్ సాబ్ మందక్కి, సమీవుల్లా లాలన్వర్, మహ్మద్ సాదిక్ అఘాసిమని, షోయబ్ ముల్లా, తౌసీప్ చోటీ, రియాజ్ సావికేరి. 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు చేసిన తర్వాత వారందరినీ చాలా నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.

Next Story